NLR: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలో ఉన్న తుఫాను షెల్టర్‌ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. తుఫాన్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం మైపాడు పీహెచ్‌సీని పరిశీలించారు. ప్రజల సురక్షిత నివాసం, ఆహారం, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.