KDP: కాశినాయన మండలం రెడ్డి కొట్టాల MPUP పాఠశాలలో SGT టీచర్ పరిమళజ్యోతి శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు మున్ముందు రెట్టింపు ఉత్సహంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు కృషి చేస్తానన్నారు.