కృష్ణా: ప్రభుత్వ విప్‌గా నియమితులైన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. విప్ పదవి ఇచ్చినందుకు సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు పలు సూచనలు చేశారు. పదవికి మంచి పేరు తేవాలని తెలిపారు.