AP: శాసన మండలిలో హోం మంత్రి అనిత గత ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో చిరుద్యోగుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల వరకు జీతాలు సరిగ్గా ఇవ్వలేదన్నారు. టీఏ, డీఏ, సరెండర్ లీవ్స్, ఐఆర్, ఇంక్రీమెంట్లు, ఏవీ ఇవ్వక ఉద్యోగులు నరకయాతన అనుభవించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 1వ తేదీన జీతాలు ఇస్తున్నామన్నారు. అయినా ఐదేళ్లు జీతాలు సరిగ్గా ఇవ్వని మీరు పీఆర్సీల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.