AP: విజయనగరం పాచిపెంట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తవలస గ్రామానికి చెందిన కుంకెన సాయికుమార్ అనే యువకుడు ఈ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో సాయికుమార్ గుండెను చెన్నైకి తరలించి.. కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులను వైద్యులు స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఆ తల్లిదండ్రుల త్యాగాన్ని వైద్యులు, గ్రామస్థులు కొనియాడారు.