TG: పాత సీఎం చేసిన తప్పులనే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ‘పదేళ్ల పైశాచిక పాలనలో బీఆర్ఎస్ రైతులను మల్లన్నసాగర్ గురించి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ కూడా రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన పడకేసింది. మళ్లీ మేమే రాబోతున్నాం అని చెప్పుకున్న ఇరు పార్టీలు తమ గొప్పలను ప్రదర్శించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.