ASR: భారత దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి కొనియాడారు. గురువారం అరకులోయలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో నేతలతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.