AP: ఏపీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024పై అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన చేశారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ల ద్వారా ఇంధన వ్యయం తగ్గించుకోవడమే తమ లక్ష్యమన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా పెట్టుబడులు, ఉపాధి సాధనే ఉద్దేశమని తెలిపారు. మొత్తం 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త విధానం రూపొందిస్తున్నామని చెప్పారు.