TG: రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రైతులను నష్టపెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. లగచర్ల ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందన్నారు.