ASR: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని సీపీఎం అరకు మండల కార్యదర్శి కే.రామారావు కోరారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో అరకులోయ తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలు మంజూరు చేయాలన్నారు.