AP: పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0ను అసెంబ్లీలో మంత్రి TG భరత్ ప్రవేశపెట్టారు. మాజీ CM జగన్ పాలనతో పారిశ్రామికవేత్తలు APని ఉత్తర కొరియాతో పోల్చారని చెప్పారు. దుబాయ్లో AP సానుకూలతలను వివరించామన్నారు. 2024-29లో రూ.5లక్షల కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉద్యోగాలు, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంగా మార్చుకున్నామని.. MSMEల బలోపేతమే లక్ష్యమన్నారు.