AP: విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తెలిపింది. మెజార్టీ ఓటర్లు తమకే ఉండటం కూటమి నుంచి పోటీ లేకపోవడంతో వైసీపీదే గెలుపు అని ఆ పార్టీ భావించింది. కానీ, వైసీపీ అంచనాలు తలకిందులయ్యాయి. కాగా, ఈనెల 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగాల్సి ఉండేది.