TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగించాలని భుజంగరావు హైకోర్టుకు ఆశ్రయించారు. నేటితో ఆయన మధ్యంతర బెయిల్ ముగిసింది. భుజంగరావు మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. సాయంత్రంలోపు కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లికోర్టు నిర్ణయంపై భుజంగరావు హైకోర్టుకెళ్లారు.