TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. స్పెషల్ వార్డులో ఇవాళ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.