VSP: VMRDA రూపొందించిన బృహత్ ప్రణాళిక-2041(మాస్టర్ ప్లాన్) పునఃపరిశీలనపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సూచనలను మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు VMRDA కార్యాలయం 8వ అంతస్తులో ప్రత్యక్షంగా లేదా www.vmrda.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ తెలిపారు.