KDP: YCP MP మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. న్యూయార్క్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆయన తరపున దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతించింది. పర్యటన అనంతరం కోర్టును సంప్రదించాలని ఆదేశించింది. అక్టోబర్ 26న పార్లమెంటరీ బృందంతో మిథున్ రెడ్డి అమెరికా వెళ్ళనున్నారు.