పల్నాడు: మాజీ కేంద్ర హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. ఆయన వర్దంతిని చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల కోసం, పార్లమెంటులో నైతిక విలువల కోసం ఆయన జీవితాంతం కృషి చేశారన్నారు.