NDL: విద్యార్థులకు స్కూల్, కాలేజీల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తకోట విజయభాస్కర్ శనివారం డోన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శశిభూషణ్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డోన్ నుంచి నియోజవర్గంలోని ప్రతి గ్రామానికి స్కూల్, కాలేజీ సమయాలకు ఆర్టీసీ బస్సు నడపాలని కోరారు.