NDL: రైళ్లలో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల, కర్నూలు రైల్వే అధికారులు సూచించారు. సోమవారం నంద్యాల స్టేషన్లో రైల్వే పోలీస్ ఫోర్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైన్ స్నాచింగ్, సిగ్నల్ ట్యాంపరింగ్ ఘటనలపై హెచ్చరిస్తూ.. ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.