TPT: తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ బుధవారం సెలవు ప్రకటించారు. ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయాలని డీఈవోని ఆదేశించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.