ప్రకాశం: చీమకుర్తి మండలం ఆర్ఎల్పురంలోని ఎస్టీ కాలనీ వద్ద గంజాయి అమ్ముతున్న నాగులూరి మార్తమ్మను సీఐ దాసరి ప్రసాద్ అరెస్టు చేశారు. ఆమె దగ్గర 1.850 గ్రాముల గంజాయిని MRO సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఆమెకు గంజాయి విక్రయించిన ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.