ATP: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఎల్లుట్ల గ్రామానికి చెందిన విద్యార్థిని శిరీష ఎంపికైంది. జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 8 మంది విద్యార్థులలో శిరీష ఒకరు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శిరీషను ఎమ్మెల్యే శ్రావణి అభినందించారు.