ప్రకాశం: ఒంగోలు విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉన్నత విద్యా మండలి ఉత్తర్వుల మేరకు డిగ్రీ కళాశాలల్లో రెండో దశ ఆన్లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువును అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈనెల 7వ తేదీన సీట్లు కేటాయించబడతాయని తెలిపారు. అనంతరం, 10వ తేదీన రిపోర్టింగ్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తరగతులు ప్రారంభమయ్యే షెడ్యూలును అధికారులు ప్రకటించారు.