TPT: రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ప్రతి నెల మూడవ శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ నినాదంతో వినూత్న థీమ్‌తో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.