W.G: తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం గ్రామంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి ఏడు డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు మురళీమోహన్, దొరబాబు, సిబ్బంది ఉన్నారు.