అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాయదుర్గంలో రహదారి భద్రత, ప్రమాద నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 ఆటో డ్రైవర్లు, స్థానికులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్/సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవ్ చేయకపోవడం, తప్పు పార్కింగ్ నివారణపై అవగాహన కల్పించారు.