NTR: చందర్లపాడు మండలం కోనయపాలెంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, వెంటనే పరిష్కార దిశగా చర్యలు చేపట్టేందుకు ఈ ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. సామాన్య మానవుడు ఎక్కడా ఇబ్బంది పడకుండా, సులభంగా తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.