ప్రకాశం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పెద్ద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయలని సూచించారు.