BPT: కుల గణనపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు అన్నారు. ఇది సామాజిక న్యాయానికి దోహదపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కుల గణనపై పారదర్శకత లేకుండా మోసం చేశారని విమర్శించారు.