ATP: MP అంబికా లక్ష్మీనారాయణ గారు మంగళవారం బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ SA కోరితో సమీక్షా సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ అభివృద్ధి, నూతన కోర్సుల ప్రవేశం, విద్యార్థుల శ్రేయస్సుపై ఎంపీ చర్చించారు. ముఖ్యంగా, AI వంటి ఆధునిక, ప్రాయోగిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.