MBNR: జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన నిర్వహించబోయే నూతన విశ్వబ్రాహ్మణ కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని శ్రీనివాస్ రెడ్డిని కమిటీ సభ్యులు మంగళవారం ఆహ్వానించారు. తెలంగాణ చౌరస్తాలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.