KRNL: గూడూరు మండలం తిమ్మాపురం చెరువులో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి 15 లక్షల చేప పిల్లలను విడిచారు. మత్స్యకారుల కోసం కూటమి ప్రభుత్వ పథకాలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. చేపల సాగు, మార్కెటింగ్, నిల్వ, రవాణా అభివృద్ధిలో FFPOలు కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఆధునిక చేపల పెంపక పద్ధతులు, ప్రభుత్వ మద్దతు, సహకార సంఘాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.