NLR: రాపూరులో శనివారం జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు భూసార పరీక్షలు మట్టి నమూనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భూసార పరీక్షలు ఆధారంగా రైతులు తమ పంటలకు ఎరువులు వేసుకోవాలన్నారు. తగిన మోతాదులోనే రైతులు ఎరువులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మారుతీ దేవి, శాస్త్రవేత్త అనిషా, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.