NLR: పట్టణంలోని వెంకటేశ్వరపురం సెంటర్, విజయ డైరీ, నల్లకాలువ, ఇస్లాంపేట, లక్ష్మీవీధి, అంబేద్కర్ కాలనీ, వాటర్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్ తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. స్థానిక ప్రజలు, వినియోగదారులు సహకరించాలని కోరారు.