ప్రకాశం: జిల్లాలో దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి స్వామి అన్నారు. ఇందులో భాగంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, R&B అధికారులతో తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్ల పరిస్థితులపై మంత్రి స్వామి సమీక్షించారు. అనంతరం ఎక్కడెక్కడ రహదారులు దెబ్బ తిన్నాయో నివేదిక తయారు చేసి వెంటనే వాటి మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.