PPM: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి సీడీపీవో బొత్స అనంతలక్ష్మి నోటిఫికేషన్ విడుదల చేశారు. పాచిపెంట, మక్కువ మండలాల్లోని వివిధ గ్రామాల్లో మొత్తం 24 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థులు మే 14వ తేదీలోగా తమ దరఖాస్తులను పాచిపెంట కార్యాలయంలో అందజేయాలని కోరారు.