VSP: గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, బోధన-పరిశోధనలలో అత్యున్నత ప్రమాణాలకు గుర్తింపుగా ఎన్ఐఆర్ఎఫ్ 2025 ర్యాంకింగ్ దేశవ్యాప్తంగా 33వ స్థానంలో నిలిచింది. గతేడాది 48వ ర్యాంక్ నుంచి మెరుగైందని ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పేటెంట్లు, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురణలు, పరిశోధకుల కృషి ఈ విజయానికి కారణమని అధికారులు పేర్కొన్నారు.