E.G: అమలాపురం సత్తెమ్మ గుడి సమీపంలో ఆదివారం జరిగిన ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధనలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్(SAF)కు తన వ్యక్తిగత నిధుల నుంచి రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక వర్గీయులు ఐక్యతతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు.