AKP: యువత పరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ‘నేను నా యువత’ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు. అలాగే యువతీ యువకులను అన్ని విధాల ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.