VZM: ఇటీవల కురిసిన వర్షాలకు మెంటాడ రోడ్డు చెరువును తలపిస్తుంది. కొద్దిపాటి వర్షానికి రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో బాటచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెంటాడ రోడ్డులో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను వ్యాపారస్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మూసివేయడంతో రోడ్డుపై నీరు నిలిచిపోతుందని ప్రజలు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.