PLD: ఈ నెల 13న పిడుగురాళ్ల సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జడ్జి ప్రవళిక శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా రాజీపడదగిన సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాల కేసులను పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. తద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు.