NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈనెల 17 నుంచి 27వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్లు విశేష పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలు నడుమ గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా సాగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.