కోనసీమ: పీ. గన్నవరంలోని సీహెచ్సీ వద్ద ఉన్న 104, 108 వాహనాలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా వాహనాల ద్వారా ప్రజలకు అందిస్తున్న అత్యవసర వైద్య సేవలు ఇతర విషయాల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వాహనాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై కొన్ని మీడియా మాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు