GNTR: మంగళగిరిలో జరిగిన ఏపీ టూరిజం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి పారిశ్రామిక హోదా కల్పించి, టూరిజం హబ్‌గా మార్చేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. అల్లూరి జిల్లాలోని దారకొండ, తారాబు, గుర్రాయి జలపాతాలు, వంజంగి మేఘాలకొండ, అక్కాచెల్లెళ్ల గుమ్మి వంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తీర్మానం చేశారు.