CTR: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు స్థానిక గాంధీ రోడ్డులోని అర్బన్ డివిజన్ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. చిత్తూరు, పూతలపట్టు, నియోజకవర్గాల వినియోగదారులు సమస్యలను రాత పూర్వకంగా తెలుపాలన్నారు.