కృష్ణా: చంద్రబాబు గ్లోబల్ నాలెడ్జ్ వల్లనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్మెల్యే రాము ఆదివారం అన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమలో సమగ్రంగా పెట్టుబడులను సాధించడం చాలా గొప్ప విషయమని చెప్పారు. వైజాగ్ సమ్మిట్ ద్వారా ఏపీ సత్తా ఏంటో దేశానికి తెలిసిందని, అనేక రాష్ట్రాలు పోటీపడిన, ప్రతిష్టాత్మక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయన్నారు.