అన్నమయ్య: పీలేరు పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి PL నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం పీలేరు పంచాయతీ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులు నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.