KDP: జూన్ నెలకు సంబంధించి ప్రభుత్వం రేషన్ దుకాణాలకు బియ్యం, చక్కర మాత్రమే పంపిణీ చేసింది. జొన్నలు, రాగులు, గోధుమలు, వంటనూనె తదితర నిత్యావసర సరుకులు ఇవ్వలేదు. బహిరంగ మార్కెట్లో వంట నూనెలు ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. వీటిని రేషన్ దుకాణాల ద్వారా సప్లై చేయాలని కోరుతున్నారు.