KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ దర్శించుకున్నారు. ఆలమ మర్యాదలతో స్వాగతం పలికి, రామాలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సేద తీరిన ఆయనకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేసి, ఘనంగా సత్కరించారు.