AKP: అనకాపల్లి పట్టణం నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. స్థానిక నాయి బ్రాహ్మణ సేవా సంఘం హాల్లో మంగళవారం జరిగిన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్షుడిగా టీ నర్సింగరావు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా టీ గోవింద్, ఉపాధ్యక్షుడిగా ఎం నాగబాబు, సహాయ కార్యదర్శిగా ఎం ఈశ్వరరావు, కోశాధికారిక బీ.నాగరాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.